News August 30, 2024
అమ్మాయిలూ.. పానీపూరీతో జాగ్రత్త!
అమ్మాయిలు రోజూ పానీపూరీ తింటూ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు గుర్తించారు. దీని వల్ల అమ్మాయిల్లో PCOD సమస్యలు అధికమవుతున్నట్టు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, వెయిట్ గెయిన్, పెదాలపై రోమాలు పెరగడం వంటి సమస్యలను అమ్మాయిల్లో గుర్తిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. పానీపూరీలో నీరు హైజినిక్గా లేకపోతే టైఫాయిడ్ బారినపడే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News January 15, 2025
భారత్ ఘన విజయం
ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది.
News January 15, 2025
ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు
మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్పురీ జీ మహారాజ్ ఉన్నారు.
News January 15, 2025
నామినేషన్ వేసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేశారు. తన భార్య, పార్టీ నేతలు, అభిమానులు వెంట రాగా ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడంతో ఇటీవలే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.