News June 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

TG: ఇంటర్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా 63.86% ఉత్తీర్ణత నమోదైంది. 70.26% బాలికలు, 58.39% బాలురు పాసయ్యారు. 1,38,477 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగా 43.77% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 47.54%, బాలురు 41.37% మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040 24655027కు కాల్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

Similar News

News November 19, 2025

టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

image

సున్నితమైన, రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై TV ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఎర్రకోట పేలుడు సహా ఇటీవలి ఘటనలకు సంబంధించిన సమాచార ప్రసారానికి దూరంగా ఉండాలని కోరింది. కొన్ని ఛానెళ్లు హింసను ప్రేరేపించేలా, శాంతికి భంగం కలిగించేలా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వీడియోలు టెలికాస్ట్ చేశాయని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే దృశ్యాలను ప్రసారం చేయొద్దని సూచించింది.

News November 19, 2025

ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.

News November 18, 2025

జైల్లో మొహియుద్దీన్‌పై దాడి!

image

టెర్రర్ మాడ్యూల్‌ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్‌ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్‌లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.