News August 8, 2024

GIS: హైదరాబాద్‌లో డ్రోన్ సర్వే: కమిషనర్ ఆమ్రపాలి

image

పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణ మెరుగుపరచడమే GIS సర్వే ప్రధాన లక్ష్యమని కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(GIS) గురించి వివరించారు. గ్రేటర్‌ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, చిన్న పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులు అన్నింటిని, సిటీ మొత్తం మ్యాపింగ్ జరుగుతుందన్నారు. 

Similar News

News November 28, 2024

HYD: జంతువుల వెచ్చదనానికి ఏర్పాట్లు

image

సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.

News November 28, 2024

HYDలో మరో ముఠా.. ప్రజలు జాగ్రత్త..!

image

HYD ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా వచ్చిందన్నారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్‌స్టర్లు బట్టలు అమ్మేవారిగా, చౌకైన వస్తువులను విక్రయించే వారిగా కాలనీల్లోని గృహాలు, షాపుల్లో రెక్కీ నిర్వహిస్తారని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

News November 27, 2024

జియో ఫిజిక్స్ విభాగంలో ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ జియో ఫిజిక్స్‌లో ప్రాజెక్ట్ ఫెల్లో పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు  తెలిపారు. ‘గ్రావిటీ సర్వేస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, ఇండియా’ పేరుతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులను తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.