News April 1, 2024
3న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్

అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా, శ్రీనివాస్‌రెడ్డి, సునీల్, సత్యం రాజేశ్, అలీ, బ్రహ్మాజీ తదితరులు నటించారు. 2014లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News March 19, 2026
కొత్త డీజీపీ రేసులో ముగ్గురు!

TG: డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీవీ ఆనంద్(1991 బ్యాచ్), వినయ్ ప్రభాకర్ ఆప్టే(1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా(1994 బ్యాచ్)తో కూడిన ఫైనల్ లిస్టును యూపీఎస్సీ పంపింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది.
News March 19, 2026
ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.
News March 19, 2026
వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ!

TG: ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్ఠానంతో CM రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కనుందని చర్చ సాగుతోంది.


