News September 27, 2024
గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వండి: హరీశ్ రావు

TG: గ్రామ పంచాయతీలకు నిధులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 8 నెలలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు రిలీజ్ చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాశారు. కేంద్రం రూ.1,200 కోట్లు కేటాయించినా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. పంచాయతీ కార్మికులకు దసరా, దీపావళికైనా జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News February 5, 2026
దివ్యాంగులకు ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ సైకిళ్లు

TG: దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఇందుకోసం OBMMS <
News February 5, 2026
25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: కాగ్నిజెంట్

IT సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది దాదాపు 25K మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. 2025లో 20K మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, ఈ సంఖ్యను 20 శాతం మేర పెంచుతామని సంస్థ CEO రవికుమార్ తెలిపారు. AI ద్వారా ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామన్నారు. IITలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా ప్రోగ్రామర్లు, ఇంజినీర్లను తీసుకుంటామని పేర్కొన్నారు.
News February 5, 2026
ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ లక్షణాలు

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ సమస్య ఉన్న మహిళల్లో రొమ్ము వాపులు, నొప్పి, రొమ్ముల్లో కణితులు, రొమ్ముల దగ్గర చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరు మహిళల్లో అయితే రొమ్ముల నుంచి ఆకుపచ్చ లేదా గోధుమ రంగు రక్తస్రావం కూడా జరుగుతుంది. ఇలా ఎక్కువగా జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తారు.


