News March 20, 2025
గన్ లైసెన్స్ ఇవ్వండి: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ ప్రూప్ వెహికిల్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూప్ వెహికిల్ తిరగలేదని రాజాసింగ్ అన్నారు. భద్రత కోసం తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.
Similar News
News March 20, 2025
భారత జట్టుకు భారీ నజరానా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.58 కోట్ల నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. మార్చి 9న న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ ప్రైజ్ మనీ(రూ.19.50+కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం.
News March 20, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. టాప్ సెలబ్రిటీలపై కేసు

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు 18 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వీరిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత ఉన్నారు.
News March 20, 2025
BREAKING: హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసు కొట్టివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి హరీశ్తో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.