News June 22, 2024
రుషికొండ ప్యాలెస్ నాకివ్వండి: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను తనకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లిస్తానని, లీజుకైనా ఇవ్వాలని ఆయన కోరారు. తన లేఖను కొనుగోలు ఒప్పందంగా పరిగణించాలని తెలిపారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు. కాగా జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
ఆ దేశాల నుంచి ఎవరినీ రానివ్వం: ట్రంప్

థర్డ్ వరల్డ్ కంట్రీస్(అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని) నుంచి శాశ్వతంగా మైగ్రేషన్ నిలుపుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘US సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులను, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్‌కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి’ అని తెలిపారు.
News November 28, 2025
మట్టి పాత్రలు ఎలా వాడాలంటే?

ప్రస్తుతం చాలామంది మట్టిపాత్రలు వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. కొత్త మట్టిపాత్రను వాడేముందు సీజనింగ్ చేయాలి. రోజంతా నీళ్లలో నానబెట్టి ఆరాక పూర్తిగా నూనె రాసి ఆరనివ్వాలి. కుండను చిన్న సెగ మీద ఉంచి మంటను పెంచుతూ వెళ్లాలి. వీటిలో ఆహారం కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి ఇసుక, సున్నిపిండి, బూడిద, కుంకుడు రసం వాడాలి.
News November 28, 2025
అన్నల ఆలోచన మారిందా..?

ఇటీవల మల్లోజుల, ఆశన్న వంటి అగ్రనేతలు లొంగిపోతే వారు ఉద్యమ ద్రోహులని మండిపడుతూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కానీ JAN-1న అందరం లొంగిపోతామని ప్రకటించిన తాజా లేఖలో ఆయుధాలు వీడటమంటే ప్రజలను మోసం చేసినట్లు కాదని పేర్కొంది. ‘సంఘర్షణకు ఇది సరైన సమయం కాదు.. అందుకే ఆయుధ పోరాటం వీడుతున్నాం’ అని వివరించింది. అన్నల్లో ఆలోచన మార్పుకు కారణం.. వాస్తవం అర్థమవడమా? అన్ని దారులు మూసుకుంటున్నాయనే ఆందోళనా?


