News December 30, 2024

రైతులకు కొత్త రుణాలు ఇవ్వండి: తుమ్మల

image

TG: రుణమాఫీ పూర్తైన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పలువురు రైతులకు రుణాలు అందకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. రానున్న సంవత్సరంలో DCCBలు మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు. గతంలో పలు DCCBల్లో తప్పులు జరిగాయని, అవి జరగకుండా చూసుకోవాలన్నారు. టెస్కాబ్-2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా రుణమాఫీ, బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు.

Similar News

News November 19, 2025

HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

image

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.

News November 19, 2025

టికెట్లు బుక్ చేసుకున్నారా?

image

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్‌సైట్‌లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 19, 2025

ఈ హెయిర్ ‌స్టైల్స్‌తో హెయిర్‌ఫాల్

image

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్​స్టైల్స్​ ప్రయత్నించాలని సూచించారు.