News June 21, 2024

జగన్‌కు గౌరవం ఇవ్వండి: సీఎం చంద్రబాబు

image

AP:మాజీ CM జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకు అనుమతించాలని CBN అధికారులను ఆదేశించారు. ప్రతిపక్షనేత హోదా దక్కకపోవడంతో జగన్ గేటు బయటే కారు దిగి అసెంబ్లీ లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో CM ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని MLAలకు CM సూచించారు. చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయవద్దని, రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని TDP సహచరులకు బాబు తెలిపారు.

Similar News

News February 4, 2025

ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్

image

విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.

News February 4, 2025

పార్టీ విప్‌లను నియమించిన KCR

image

TG: శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను నియమిస్తూ KCR నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. తమ పార్టీ అధినేత KCR నిర్ణయాన్ని స్పీకర్‌కు ఆ పార్టీ నేతలు తెలియజేశారు.

News February 4, 2025

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘గేమ్ ఛేంజర్’

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. JAN 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా విడుదలైన 28 రోజుల్లోనే ఈ చిత్రం OTTలోకి రానుండటం గమనార్హం.

error: Content is protected !!