News March 19, 2025

ఉపాధి కూలీలకు రూ.400 వేతనం ఇవ్వండి: సోనియా

image

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజువారీ కనీస వేతనాన్ని రూ.400 ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 150 పనిదినాలు కల్పించాలన్నారు. పార్లమెంటులో జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేయాలని చూడటం ఆందోళనకరమని చెప్పారు.

Similar News

News November 10, 2025

రష్యా భయంతో రక్షణ వ్యయాన్ని పెంచుతున్న EU దేశాలు

image

రష్యా దాడి భయంతో యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. తాజాగా జర్మనీ $1.2Bతో ఎయిర్ బస్ నుంచి 20 మిలటరీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. 2027 నాటికి ఇవి అందనున్నాయి. ఇప్పటికే అది 62 H145M హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. కాగా సాయుధ దళాల అత్యవసర ఆధునీకరణ కోసం జర్మనీ ఈ ఏడాదిలో ప్రత్యేక నిధినీ ఏర్పాటు చేసింది. ఈ ఆర్డర్లతో అనేక ఆయుధ తయారీ సంస్థలు ప్రయోజనాలు పొందుతున్నాయి.

News November 10, 2025

అత్యాచార బాధితురాలిపై లాయర్ ఘాతుకం

image

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై అత్యాచారం చేశాడో లాయర్. UPలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 2022లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసును కోర్టు బయట సెటిల్ చేస్తానని నిందితుల్లో ఒకరి లాయర్ జితేంద్ర సింగ్ యువతి(24)ని నమ్మించాడు. హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి నుంచి విడిపించుకుని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు ఇంటిపై నుంచి దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి.

News November 10, 2025

NSUTలో 176 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (<>NSUT<<>>)లో 176 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్, BS, ME, ఎంటెక్, MS, PhDతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35- 50 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsut.ac.in/