News April 14, 2025

రోహిత్‌కు క్రెడిట్ కట్టబెట్టడం కరెక్ట్ కాదు: మంజ్రేకర్

image

నిన్న రాత్రి DCపై ముంబై సాధించిన విజయం వెనుక గొప్పదనాన్ని రోహిత్‌కు కట్టబెట్టడం సరికాదని మాజీ క్రికెటర్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సలహాలు ఇచ్చారు కరెక్టే. కానీ ఎవరు ఎన్ని చెప్పినా దాన్ని మైదానంలో అమలు చేయాల్సింది కెప్టెనే. క్రెడిట్ అంతా రోహిత్‌కు ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా తేడా జరిగి మ్యాచ్‌ను ముంబై చేజార్చుకుని ఉంటే అందరూ హార్దిక్‌నే తిట్టి ఉండేవారు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2025

అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

image

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్‌కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్‌ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.

News April 16, 2025

శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

image

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఛైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో ఆలయ అధికారులు ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగింది. అంతకముందు అన్నం, పెసరపప్పు రాశులుగా పోసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.

News April 16, 2025

ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

image

1848: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు(ఫొటోలో) జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1910: సాహితీవేత్త ఎన్ఎస్ కృష్ణమూర్తి జననం
1914: చిత్రకారుడు కేహెచ్ ఆరా జననం
1951: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ జననం
1853: భారత్‌లో తొలి పాసింజర్ రైలును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది

error: Content is protected !!