News July 24, 2024
BRSకు పాస్ మార్కులు వేస్తున్నాం: శ్రీధర్బాబు

TG: అసెంబ్లీ వేదికగా ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూపిస్తూ BRS MLA హరీశ్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను BRS నాయకులు బట్టీ పట్టినందుకు చాలా సంతోషమన్నారు. వెంటనే ఆ పక్కనే కూర్చొని ఉన్న సీఎం రేవంత్ ‘పాస్ మార్కులు వేశారా? లేదా?’ అని సరదాగా అడగ్గా.. ‘ఈ విషయంలో BRSకు మేం పాస్ మార్కులు వేశాం’ అని శ్రీధర్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
Similar News
News November 15, 2025
సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>
News November 15, 2025
బిహార్: ఓట్ షేరింగ్లో ఆర్జేడీనే టాప్

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.
News November 15, 2025
భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>


