News November 29, 2024
ఆ ప్రచారంలో అల్లు అర్జున్ పాలుపంచుకోవడం సంతోషం: సీఎం రేవంత్

డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే ప్రకటనలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘మన పిల్లల్ని, రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి రక్షించుకునేందుకు ప్రజల్లో అవగాహనకోసం చేపట్టిన ప్రచారంలో అల్లు అర్జున్‌ని చూడటం సంతోషంగా ఉంది. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’ అని ట్విటర్లో పిలుపునిచ్చారు.
Similar News
News December 19, 2025
దోషాలను పోగొట్టే కొన్ని చిన్న అలవాట్లు

మూగ జీవులకు ఆహారం పెడితే పుణ్యఫలాలు కలుగుతాయని నమ్మకం. వాటిపై చూపే కరుణ మన దోషాలను హరిస్తుందట. ‘శునకాలకు ఆహారం ఇస్తే ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. చేపలకు గింజలు వేస్తే ఇంట్లో కలహాలు తగ్గుతాయి. పక్షులను ఆదరిస్తే దారిద్ర్యం దరిచేరదు. గోమాతకు గ్రాసం పెడితే జీవితం సంతోషంగా, తృప్తిగా ఉంటుంది. ఈ అలవాట్లు మనకు మానసిక శాంతిని ఇస్తాయి. నిస్వార్థంగా జీవులకు సేవ చేయడం భగవంతుని ఆరాధనతో సమానం.
News December 19, 2025
తన కంటే 17ఏళ్ల చిన్నోడితో మలైకా డేటింగ్?

బాలీవుడ్ సినీయర్ నటి మలైకా అరోరా(52) తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈమె తొలుత నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకొని, తన కంటే వయస్సులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో కొంతకాలం డేటింగ్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనేలోపు రిలేషన్ బ్రేక్ అయింది. తాజాగా ఆమె హర్షా మెహతాతో డేటింగ్లో ఉన్నట్లు టాక్. అయితే దీనిపై వీరి నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
News December 19, 2025
ధనుర్మాసం: నాల్గోరోజు కీర్తన

‘ఓ మేఘుడా! లోభం చూపకుండా సముద్రపు నీటిని నిండుగా తాగి, నారాయణుని నల్లని మేని రంగును ధరించి ఆకాశానికి ఎగయుము. స్వామి సుదర్శన చక్రంలా మెరిసి, పాంచజన్య శంఖంలా గంభీరంగా గర్జించు. శారంగ ధనుస్సు నుంచి వచ్చే బాణాల వలె అమృతధారలను కురిపించు. లోకమంతా సుఖంగా ఉండాలని, మా వ్రతం నిర్విఘ్నంగా సాగాలని వెంటనే వర్షించు’ అని సమస్త జీవరాశికి మేలు కోసం అండాల్ దేవి పర్జన్యుని వేడుకుంటోంది. <<-se>>#DHANURMASAM<<>>


