News September 16, 2024
ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నా: కమలా హ్యారిస్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో <<14112140>>కాల్పులు<<>> జరగడాన్ని వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఖండించారు. ‘ఆయన సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నా. అమెరికాలో హింసకు తావు లేదు’ అని ట్వీట్ చేశారు. 2 నెలల వ్యవధిలో ట్రంప్ టార్గెట్‌గా రెండుసార్లు కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.
Similar News
News October 28, 2025
కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.
News October 28, 2025
రైతులకు కేంద్రం శుభవార్త

దేశంలోని రైతులను ఆదుకొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫెర్టిలైజర్ సబ్సిడీకి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో రైతులకు ₹3వేల కోట్లమేర లబ్ధి చేకూరనుంది. PM అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫెర్టిలైజర్ సబ్సిడీ అంశంపై చర్చించి ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర మరికొన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపైనా మధ్యాహ్నం 3కి మీడియాకు వెల్లడిస్తారు.
News October 28, 2025
వాట్సాప్ నుంచి గ్యాస్ బుక్ చేయొచ్చు!

LPG సిలిండర్‌ను వాట్సాప్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, Indane, HP గ్యాస్ కస్టమర్లు తమ రిజిస్టర్డ్ నంబర్ నుంచి కంపెనీ అధికారిక వాట్సాప్ నంబర్‌కు “Hi” లేదా “REFILL” అని మెసేజ్ చేస్తే చాలు. ఈ 24×7 సేవ ద్వారా తక్షణ బుకింగ్ కన్ఫర్మేషన్, డెలివరీ ట్రాకింగ్, చెల్లింపు సౌకర్యాలు లభిస్తాయి. Bharat- 1800 22 4344, Indane- 75888 88824, HP Gas -92222 01122 నంబర్లకు వాట్సాప్ చేయొచ్చు. SHARE IT


