News January 24, 2025

ఎల్లుండి రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ విడుదల

image

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈనెల 26న చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.

Similar News

News November 10, 2025

కుక్కల నియంత్రణపై మేయర్ సమీక్ష

image

గ్రేటర్ వరంగల్ నగరంలోని జన సంచార ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వీధి కుక్కల నియంత్రణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి పాల్గొని సమర్థవంతం గా నిర్వహించుటకు మేయర్ సూచనలు చేశారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.

News November 10, 2025

మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

image

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్‌కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.