News March 3, 2025
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వచ్చేసింది

నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాని మాస్ లుక్లో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ఓదెల శ్రీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2026, మార్చి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అసభ్య పదాలు ఉన్న కారణంగా వీడియోను ఇక్కడ పబ్లిష్ చేయడం లేదు. వీడియో కోసం ఇక్కడ <
Similar News
News March 3, 2025
ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయిన పంత్

టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ ‘లారెస్ వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2022లో పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. 14 నెలల తర్వాత పునరాగమనం చేశారు. పంత్ తిరిగి కోలుకున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో నామినేట్ చేశారు. ఏప్రిల్ 21న విజేతలను ప్రకటించి అవార్డును అందజేయనున్నారు. భారత క్రికెటర్లలో పంత్ కంటే ముందు సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
News March 3, 2025
ట్రెండింగ్లో ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి <<15636348>>షామా మహమ్మద్ చేసిన కామెంట్స్ <<>>దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. టీమ్ ఇండియాకు చేసిన సేవకు ఇదా మీరు ఇచ్చే గౌరవమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం కాంగ్రెస్ మీదకూ పాకింది. ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికే 10.5వేల ట్వీట్లు పడ్డాయి.
News March 3, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11గంటల పాటు సాగింది.