News February 17, 2026
GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్‌లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 20, 2026
ట్రోలిన్ పేలి.. గట్టుసింగారం వాసి మృతి

యాదాద్రి (D) భూదాన్ పోచంపల్లి ధోతిగూడెం శివారులోని ఓ కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో కూసుమంచి గట్టుసింగారానికి చెందిన ధార పవన్ మృతి చెందారు. భోజన విరామ సమయంలో కార్మికులంతా బయటకు వెళ్లగా, విధుల్లో ఉన్న పవన్ వద్ద ట్రోలిన్ పేలింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సీనియర్ కెమిస్ట్రీ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 20, 2026
రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి బాధాకరం: హరీష్‌రావు

రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 20, 2026
పెనుబల్లి: మిత్రుడి కోసం వచ్చి.. అనంతలోకాలకు!

మిత్రుడి దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా ఎండపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బర్రె వంశీ మృతి చెందారు. పెనుబల్లి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి డిపోలో పనిచేస్తున్న వంశీకి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. స్నేహితుడిని కడసారి చూసేందుకు వచ్చి, తానూ విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.


