News April 4, 2025

GNT: అభిరామ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

image

సీఎం చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్‌ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండు సీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు.

Similar News

News October 28, 2025

గుంటూరు: 92 కేంద్రాలకు 6 వేల మంది తరలింపు

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల మంది నిర్వాసితులను తరలించారు. కేంద్రాల్లో వారికి తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా నేతృత్వంలో యంత్రాంగం సేవలు అందిస్తోంది.

News October 28, 2025

అవసరమైతే సహాయ చర్యలు చేపట్టండి: లోకేశ్

image

మొంథా తుఫాను తీవ్రతను సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేశ్ మంగళవారం సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను పరిస్థితులను నిరంతరం అంచనా వేయాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూటమినేతలు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.

News October 28, 2025

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ముంతా తుపాన్ ఎఫెక్ట్

image

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. తెనాలి, గుంటూరు, మంగళగిరి, కొల్లిపర మండలాల్లో గాలివానలు ముప్పు రేపుతున్నాయి. భారీ గాలి వేగంతో చెట్లు ఊగిపోతుండగా, కొన్ని చోట్ల గాలితో కూడిన వర్షం పడుతుంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.