News February 11, 2025

GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

Similar News

News November 28, 2025

కరీంనగర్‌: పాండే ప్రస్థానం.. స్ఫూర్తిదాయకం..!

image

వెటరన్ ఆల్రౌండర్ శిఖా పాండే రూ.2.4కోట్లకు పలకడం గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్‌వాసి శిఖ జిల్లాకే కాకుండా దేశంలోని మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక గ్రామీణ క్రీడాకారిణుల్లోని ప్రతిభను గుర్తించడంలో WPL బెస్ట్ ఈవెంటనే చెప్పాలి. భవిష్యత్తులో మరింతమంది మన ప్రాంతం నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు శిఖ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.

News November 28, 2025

కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

image

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.

News November 28, 2025

SVUలో ర్యాగింగ్.. హైకోర్టు కీలక తీర్పు

image

SVU సైకాలజీ డిపార్ట్మెంటులో జూనియర్లపై HOD ఆదేశాలతో సీనియర్లు <<18239778>>ర్యాగింగ్<<>> చేయగా.. అప్పట్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని పరిశోధక విద్యార్థి అశోక్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన కోర్టు వర్సిటీ అధికారులకు నోటీసులు పంపమని ఆదేశించినట్లు అశోక్ పేర్కొన్నారు.