News February 11, 2025
GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News March 16, 2025
సిద్దిపేట: ప్రతి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉంటా: MLC

ప్రతి ఉపాధ్యాయునికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. ఇటీవలే నూతనంగా గెలిచిన ఎమ్మెల్సీని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాజ్, సురేశ్ ఆధ్వర్యంలో పలువురు టీచర్లు ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొమురయ్య మాట్లాడుతూ.. విజయానికి కృషి చేసిన తపస్ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ అండగా ఉంటానన్నారు.
News March 16, 2025
VZM: అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తాం: SP

గంజాయి ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా చేపట్టినా, వినియోగించినా నేరమేనన్నారు. గత సంవత్సరంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 1656.990 లక్షల కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు.
News March 16, 2025
నాన్ వెజ్ ఎవరు తినకూడదంటే?

కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కానీ అందరికీ మాంసాహారం సరిపడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదు. ఇందులో ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ వీరికి హానికరం. గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు కూడా ఇది తినకపోవడమే బెటర్. ఇందులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది. అలర్జీ, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఉన్నవారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు.