News January 6, 2025

GNT: కుష్టు వ్యాధి అవగాహణ పోస్టర్ల ఆవిష్కరణ

image

సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజస్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. “లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్”పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. 

Similar News

News January 10, 2026

నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాతలు: మంత్రి అనిత

image

నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని KL University ఆవరణలో శనివారం జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్‌లో ఆమె పాల్గొని, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ పోస్టర్‌తో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

News January 10, 2026

GNT: మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్‌మెంట్‌పై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

News January 10, 2026

GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

image

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.