News February 17, 2025
GNT: కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో RTC బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.
Similar News
News March 28, 2025
GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడిపై పట్టాభిపురం పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.
News March 28, 2025
ఉండవల్లిలో యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించినట్లు సమాచారం.
News March 28, 2025
ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన భధ్రతా సీళ్లు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.