News January 27, 2025
GNT: డిపాజిట్ మిషన్లో దొంగ నోట్లు

తాడేపల్లిలో ఓ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఉన్న డిపాజిట్ మిషన్లో దొంగ నోట్లు ప్రత్యక్షం అయ్యాయి. ఓ యువకుడు రూ. 50 వేలు డిపాజిట్ చేసేందుకు రాగా రూ. 32 వేలము మాత్రమే డిపాజిట్ అయ్యాయి. దీంతో అతను బ్యాంకు అధికారులను సంప్రదించగా మిగతా ఎమౌంట్ దొంగ నోట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 3, 2025
ENCOUNTER.. ఐదుగురు మావోలు మృతి

ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మరణించారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News December 3, 2025
అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కోడుమూరు మండలం గోరంట్లలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులతో కలిసి గర్భిణులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పాలు, గుడ్లు, బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో శుభ్రతను పాటించాలని ఆదేశించారు.
News December 3, 2025
జగిత్యాల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మల్లాపూర్లో 13.2℃, కథలాపూర్ 13.5, మన్నెగూడెం 13.6, గుల్లకోట 13.8, జగ్గసాగర్, పూడూర్ 13.9, రాఘవపేట, గోవిందారం, ఐలాపూర్, మేడిపల్లి 14, రాయికల్, పెగడపల్లి 14.1, పొలాస, సారంగాపూర్, ఎండపల్లి, మల్యాల, అల్లీపూర్, నేరెళ్ల 14.2, కోరుట్ల, బుద్దేశ్పల్లి 14.4, గొల్లపల్లి, గోదూరు, మద్దుట్ల 14.5, తిరుమలాపూర్, మెట్పల్లి 14.6, కొల్వాయిలో 14.8℃ల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


