News July 20, 2024
GNT: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడు
తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి జీజీహెచ్‌లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కొత్తపేట పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు బాలుడిని అప్పగించారు. షేక్ అబ్దుల్ బాసిత్ (9) జీజీహెచ్‌లో ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన స్థానికులు బాలుడిని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. బాలుడు తల్లిపేరు షరీఫా అని, విజయవాడలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నట్లు చెప్పాడన్నారు. తెలిసినవారు 0863-2221815 ఫోన్ చేయగలరని సీఐ తెలిపారు.
Similar News
News October 11, 2024
నేటి నుంచి తక్కువ ధరలకే విక్రయాలు: మంత్రి నాదెండ్ల
అమరావతి: రాష్ట్రంలో అన్ని షాపుల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వంట నూనెలు తక్కువ ధరకే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.పామోలిన్ లీటర్ రూ.110, సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.124 చొప్పున అమ్మనున్నట్లు చెప్పారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున తక్కువ ధరలకు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఒకే ధరకు నూనెలు అమ్మాలని వ్యాపారస్తులకు ఆయన సూచించారు.
News October 11, 2024
తాడేపల్లి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు 11.15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా విద్యుత్ శాఖపై రివ్యూ చేస్తారు. అనంతరం మైనింగ్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని కార్యాలయం తెలియజేసింది
News October 11, 2024
25 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన
మంత్రి నారా లోకేశ్ ఈనెల 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 29, 30 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ వార్షిక ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని ఆయా వర్గాలు తెలిపాయి. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరిస్తారని చెప్పారు.