News February 4, 2025
GNT: నగ్న చిత్రాల పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా.. అరెస్ట్

అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన దేవనాయక్‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు నిడదవోలు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. నిందితుడి నుంచి రూ. 1.84 కోట్లు నగదు, ఆస్తులను సీజ్ చేశామన్నారు.
Similar News
News March 17, 2026
నల్గొండలో కల్తీపాల మాఫియా పంజా..!

పసిపిల్లలకు అమృతం కావాల్సిన పాలు.. నల్గొండ జిల్లా కేంద్రంలో విషతుల్యమవుతున్నాయి. నాగార్జునసాగర్ రోడ్డు కేంద్రంగా సాగుతున్న ‘కల్తీ’ దందా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. డీఈఓ కార్యాలయం నుంచి సాగర్ ఐలమ్మ విగ్రహం వరకు యథేచ్ఛగా సాగుతున్న ఈ విక్రయాలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, ప్రమాదకర రసాయనాలు కలుపుతూ కొందరు వ్యాపారులు కాసుల వేటలో పడ్డారు.
News March 17, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షకు 323 మంది గైర్హాజరు

జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 323 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ ప్రకటించారు. మంగళవారం ఇంటర్ పరీక్షకు 8,287 మంది హాజరు కావాల్సి ఉండగా, 7,964 మంది హాజరైనట్లు తెలిపారు. మిగిలిన 323 మంది పరీక్షకు హాజరు కాలేదన్నారు. జిల్లాలో ఎక్కడా పరీక్షలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
News March 17, 2026
పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు: నాదెండ్ల

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏలూరు ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేవారిపై 6(ఏ) కేసులు నమోదు చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


