News January 10, 2026
GNT: నటబ్రహ్మ ముక్కామల.. రంగస్థలం నుంచి వెండితెర దాకా

నటుడు, దర్శకుడు ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. న్యాయవాదిగా ఉంటూనే రంగస్థలంపై ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో బుస్సీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి, మాయాబజార్ (దుర్యోధనుడు), నర్తనశాల, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మరదలు పెళ్లి’, ‘రుష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Similar News
News January 24, 2026
ఏలూరు: ప్రమాదం.. బావాబామ్మరుదులు మృతి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
News January 24, 2026
14.6 డిగ్రీలకు పడిపోయిన పటాన్‌చెరు ఉష్ణోగ్రత

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం జిన్నారంలో 16.0°, గుమ్మడిదలలో 17.9°, అమీన్పూర్‌లో 18.8°, రామచంద్రాపురంలో 18.7°, పటాన్‌చెరులో 14.6° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం 88.4%గా ఉంది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
News January 24, 2026
అనకాపల్లి మీదుగా విశాఖ చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

అనకాపల్లి మీదుగా విశాఖ-చర్లపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదున్నర గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం చర్లపల్లి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 26 మధ్యాహ్నం 3:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు. దీనికి అనకాపల్లిలో హాల్ట్ సౌకర్యం ఉందన్నారు.


