News January 3, 2025

GNT: నేటి నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

image

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. 3వ తేదీన 530 మంది అభ్యర్థులకు, 4వ తేదీన 535 మంది, 6న 536 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనునట్లు తెలిపారు. 7న పురుషులకు దేహదారుఢ్య పరీక్షలు పునః ప్రారంభిస్తామన్నారు.

Similar News

News January 23, 2025

మాచవరం: సరస్వతి భూముల వివాదం ఇదే

image

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కి భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. గత నవంబరులో ఈ వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇందులో భాగంగా వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.

News January 23, 2025

తెనాలి: వైకుంఠపురం హుండీలో రూ.2000 నోట్లు

image

వైకుంఠపురం దేవస్థానంలో స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ. 2000 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. రూ.4 లక్షలు విలువ చేసే మొత్తం 200 నోట్లను గుర్తించారు. 2023 మేలో రూ.2000 నోట్లను ఆర్బిఐ బ్యాన్ చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నోట్లు వాడుకలో లేవు. అయితే దేవుడి హుండీలో ఈ నోట్లు మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.

News January 23, 2025

వినుకొండ: బీర్‌లో పురుగుల మందు కలిపి ఆత్మహత్యాయత్నం

image

వినుకొండ మండలం తిమ్మాయిపాలెంకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాయపాలెంకు చెందిన గోపి అనే యువకుడి భార్య మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురైన గోపి బీర్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.