News September 23, 2024
GNT: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే సోమవారం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు అందించవచ్చన్నారు. గ్రీవెన్స్ డేలో అందిన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Similar News
News December 1, 2025
గుంటూరులో 2,56,904 మందికి రూ.111.34కోట్ల పంపిణీ

జిల్లాలో ప్రతి నెల 2,56,904 మందికి లబ్దిదారులకు రూ.111.34కోట్ల పంపిణీ జరుగుతోంది. వీరిలో వృద్ధాప్యపు పింఛన్లు 1,18,174, వితంతు 70,112, చేనేత 3,862, గీతకార్మికులు 443, మత్స్యకారులు 570, ఒంటరి మహిళలు 11,330, చర్మకారులు 876, హిజ్రాలు 67, HIV బాధితులు 2,614, కళాకారులు 77, డప్పు కళాకారులు 854, దివ్యాంగులు 24,835, వైద్య సంబంధిత 1667, సైనిక సంక్షేమం 28, అభయహస్తం 3,994, అమరావతి భూముల సంబంధిత 17,401మంది.
News December 1, 2025
అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్స్టిట్యూట్

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.
News December 1, 2025
GNT: శీతాకాల సమావేశాలు.. ఎంపీ స్టాండ్ ఏంటి.!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ & ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి క్యాపిటల్ రీజన్ అభివృద్ధి నిధులు, రైల్వే & రోడ్ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నూతన ప్రాజెక్టులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.


