News December 30, 2024
GNT: నేడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు’

ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన (శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్(రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 17, 2025
క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

మహిళా ప్రపంచకప్లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.
News December 17, 2025
GNT: అధికారుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరుకు చెందిన ఓ అర్జీదారుడికి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. సమస్య తీరకుండానే పరిష్కారమైనట్లు అధికారులు తప్పుడు నివేదికలు (సెల్ఫీలు) పంపారని తేలింది. సీఎం ఆ అర్జీని ‘రీ-ఓపెన్’ చేయించినా, అధికారులు మళ్లీ పాత పద్ధతిలోనే తప్పుడు సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
News December 17, 2025
గుంటూరు ఎంపీ పనితీరుపై IVRS సర్వే

టీడీపీ MPల పనితీరుపై పార్టీ అధిష్ఠానం IVRS సర్వే చేపట్టింది. మంగళవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 08645417579 అనే నెంబర్ నుంచి సర్వే జరిగింది. ఎంపీ పనితీరు బాగుంటే 1, లేకుంటే 2, చెప్పడం ఇష్టం లేకపోతే 3 నొక్కాలని సర్వేలో కోరారు. ఎంపీలుగా గెలిచి 18 నెలలు అయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ప్రజల రెస్పాండ్ ఎలా ఉందో చూడాలి.


