News March 23, 2025
GNT: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News April 21, 2025
ఏలూరు: 100కు 100 శాతం నమోదు: డీఈవో

ఏలూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన డీఈఎల్ఈడీ 3వ సెమిస్టర్ పరీక్షకు 48 అభ్యర్థులకు 48 మంది అభ్యర్థులు హాజరవ్వగా పరీక్షా శాతం100 శాతం నమోదు అయిందని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. అలాగే డీఈఎల్ఈడీ 1వ సెమిస్టర్ పరీక్షకు 97 మంది విద్యార్థులకు 93 మంది హాజరయ్యారని 4గురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని స్పష్టం చేశారు.
News April 21, 2025
‘లగచర్ల’లో మేం చెబుతున్న విషయాన్నే NHRC బయటపెట్టింది: కేటీఆర్

TG: లగచర్ల ఘటనలో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇంతకాలంగా మేం చెబుతున్నదీ అదే. లగచర్లలో రైతులు, మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మానవ హక్కుల హననానికి పాల్పడ్డారు. ఆ విషయాన్నే నివేదిక ఖరారు చేసింది. సర్కారుపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు’ అని తెలిపారు.
News April 21, 2025
NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 58,228 మంది (మొదటి సంవత్సరంలో 28,840 మంది, రెండవ సంవత్సరంలో 29,338 మంది) విద్యార్థుల భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST