News August 31, 2024

GNT: ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక అధికారులు

image

జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో ప్రత్యేక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. గుంటూరుకు మల్లికార్జున, బాపట్లకు ఎంవి శేషగిరి బాబు, పల్నాడుకు రేఖ రాణిని ప్రభుత్వం నియమించింది.

Similar News

News September 30, 2024

ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల

image

మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని జనసేన నాయకులు హరిదాసు గౌరీ శంకర్ స్వగృహంలో 8,9,10,11,12 ,13 వార్డులలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులలో తిరిగి ప్రజల వద్ద నుంచి అడిగి సమస్యలు తెలుసుకొని వారి సమస్య తీర్చే విధంగా కృషి చేస్తానని ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు.

News September 30, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

⁍ గుంటూరు: TDP MLC అభ్యర్థి ఖరారు.?
⁍ గుంటూరు: ప్రేమ వ్యవహారం.. యువకుడి సూసైడ్
⁍ గుంటూరు: ANUలో విద్యార్థుల మధ్య ఘర్షణ
⁍ హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి
⁍ పల్నాడు: రైలులో భారీ చోరీ
⁍ మంగళగిరి: ‘సనాతన ధర్మాన్ని జగన్ అపవిత్రం చేశారు’

News September 29, 2024

పెనుమూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రేపల్లె మండలం పెనుముడి వారధి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లె నుంచి మచిలీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ లో ఉన్న పదిమందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలుకాగా క్షతగాత్రులను రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఆసుపత్రికి తరలించారు.