News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్లో అప్పగించినట్లు తెలుస్తోంది.
Similar News
News March 29, 2025
నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

KMM: ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల సంబంధిత SC నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారంను సంబందిత ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.
News March 29, 2025
గాజువాకలో యువకుడి ఆత్మహత్య

గాజువాకలో తెల్లవారుజామున యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన వసంతుల సతీశ్ కుమార్ అనే యువకుడు విశాఖలోని ఓ ఫార్మా ల్యాబ్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి చైతన్య నగర్లోని రూములో స్నేహితుడు రాజశేఖర్తో కలిసి పడుకున్నాడు. తెల్లవారుజామున ఫ్యాన్ ఆగిపోవడంతో రాజశేఖర్ లేచి చూసేసరికి సతీశ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు.
News March 29, 2025
‘ఆర్జీ కర్’ ఘటన గ్యాంగ్ రేప్ కాదు: CBI

RGకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగింది గ్యాంగ్ రేప్ కాదని కలకత్తా హైకోర్టుకు CBI తెలిపింది. సంజయ్ రాయ్ అన్న ఒకే నిందితుడు ఆ ఘోరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తమకు లభించిన ఆధారాలు, నిపుణుల అభిప్రాయాలూ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వివరించింది. అయితే కేసులో మరింత పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలున్నాయని, వాటిని విచారిస్తున్నామని కోర్టుకు విన్నవించింది.