News April 4, 2025

GNT: బీఈడీ కళాశాలల పనితీరుపై ఎన్సీటీఈ నోటీసులు

image

ANU పరిధిలోని 11 బీఈడీ కళాశాలలకు ఎన్సీటీఈ నోటీసులు జారీ చేసింది. గుంటూరు, నరసరావుపేట, రేపల్లె ప్రాంతాల్లోని కళాశాలల పనితీరు అంచనాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. మార్చిలో ప్రశ్నపత్రం లీక్, ప్రయోగ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేయడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో బీఈడీ కోర్సులో అవకతవకలను సమీక్షించడానికి ఈ నోటీసులు పంపింది.

Similar News

News October 29, 2025

నాలుగు నెలల్లో రైతుల ఫ్లాట్లు పంపిణీ చేస్తాం: మంత్రి నారాయణ

image

అమరావతి రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే చర్య అని మండిపడ్డారు. రాబోయే నాలుగు నెలల్లో రైతులందరికీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

News October 29, 2025

రేపటి నుంచి యధావిధిగా పాఠశాలలు: డీఈవో

image

జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు గురువారం నుంచి యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలో శానిటేషన్ పనులు చేయించాలని సూచించారు.

News October 29, 2025

తుళ్లూరులో ఈ నెల 31 జాబ్ మేళా

image

అమరావతి రాజధాని ప్రాంతంలో 380కి పైగా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు CRDA కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో CRDA సౌజన్యంతో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరు స్కిల్ హబ్‌లో జాబ్ మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.