News November 10, 2024

GNT: బోరుగడ్డ అనిల్ వివాదం.. సీఐపై వేటు

image

బోరుగడ్డ అనిల్‌కి అరండల్‌పేట స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఐ కె.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ సిబ్బంది నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో క్రమ శిక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని త్రిపాఠి హెచ్చరించారు.

Similar News

News December 9, 2025

GNT: అధికార పార్టీ ఎమ్మెల్యే.. అసంతృప్తి స్వరం..!

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ నిత్యం అధికారులపై ఏదో ఒక రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రోటోకాల్ దక్కలేదని ఒకసారి, రేషన్ డీలర్లపై మరోసారి కలెక్టర్‌కి గతంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె కార్యాలయం ముందు గుంతలు పడిన రహదారిని పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గం ఇటు ప్రజల్లో, అటు SMలో హాట్ టాపిక్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News December 9, 2025

గుంటూరు జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు : DEO

image

గుంటూరు జిల్లాలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(APTET) ఈ నెల10 నుంచి 21 వరకు 5 కేంద్రాల్లో జరుగుతుందని DEOసీవీ రేణుక తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్ (7996), 5వ మైలు ప్రియదర్శిని (9651), నల్లపాడు క్లే క్యాంపస్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్(30318), పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ళు కాలేజ్(8891), పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళాకాలేజ్ (1260)లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం, సాయంత్రం పరీక్ష ఉంటుందన్నారు.

News December 9, 2025

GNT: నేడు డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ప్రారంభం

image

మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్రంలోని డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలను ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేస్తుందని అన్నారు.