News February 25, 2026

GNT: రాజధాని పనుల్లో గడువు టెన్షన్.. మళ్లీ కొత్త బాధ్యతలెలా?

image

రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం రూ.1,000 కోట్లతో చేపట్టబోయే మౌలిక వసతుల పనులు రైతుల ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ సంస్థలకు అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ పలు గ్రామ సభలో చెప్పారు. అయితే రాజధాని నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థల అవస్థలు పడుతుంటే అదనంగా మౌలిక వసతులు కల్పనకు అప్పగించడం సముచితంగా లేదని పలువురు అంటున్నారు. ఇతర వ్యక్తులకు అప్పజెప్పితే బాగుంటుందన్నారు.

Similar News

News April 13, 2026

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

image

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.

News April 13, 2026

బ్రహ్మ చేసిన పొరపాటు ఏంటి?

image

ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ అందులోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి అతడిని పిసినారిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం.<<-se>>#PADHYAM<<>>

News April 13, 2026

HYD: GREAT..11ఏళ్లుగా FREE కోచింగ్

image

ప్రభుత్వ ఉద్యోగ కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.