News April 4, 2025

GNT: రైల్వే ట్రాక్‌ల వెంట యాంట్రీ-క్రాష్ బ్యారియర్ ఏర్పాటు

image

రైల్వేట్రాక్‌లపై అనధికార ప్రవేశం, పశువుల సంచారాన్ని అడ్డుకునేందుకు రైల్వే బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటగా తెనాలి-గుంటూరు సెక్షన్‌లో ఈ యాంట్రీ-క్రాష్ బ్యారియర్ / డబ్ల్యూ-బీమ్ స్టీల్ ఫెన్సింగ్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ టెండర్లు పిలిచి, ఏడాది లోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ నిర్మాణానికి రూ.13.76 కోట్లు వ్యయం కానుంది.

Similar News

News September 13, 2025

గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

image

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.