News July 21, 2024
GNT: లక్ష కడితే.. రూ.10 లక్షలు చెల్లిస్తామని మోసం

రూ. లక్ష కడితే.. 10 లక్షలు చెల్లిస్తామంటూ విజయవాడకు చెందిన ఓ ముఠా గుంటూరుకు చెందిన సరస్వతిని మోసం చేసింది. పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన నాగరాజు, మరి కొంతమంది రూ.లక్షకు పది లక్షల చొప్పున చెల్లిస్తామంటూ సరస్వతి అనే మహిళని నమ్మబలికారు. దీంతో మహిళ రూ.36 లక్షలు వారికి ఇచ్చింది. చివరికి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 24, 2025
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం: ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే “పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే” కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని సిబ్బంది నుంచి వచ్చిన 8 వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ తెలిపారు. సమస్యలు పరిష్కారమైతేనే వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన అన్నారు.
News October 24, 2025
GNT: ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు రూ. 2,27,910 చెక్కు

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు అగ్నిమళ్ల వెంకటేశ్వరరావుకు రూ.2,27,910 చెక్కును ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. 44 ఏళ్లుగా పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన ఆయన సేవలను ఎస్పీ ప్రశంసించారు. సహోద్యోగుల ఐక్యత, స్ఫూర్తి పోలీస్ శాఖకు ఆదర్శమని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఆర్ఐ సురేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 24, 2025
పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు ప్రతిపాదనలు: డీఆర్ఓ

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్కు ప్రతిపాదనలు సమర్పించడం జరుగుతుందని డీఆర్ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి నివేదికను ఎన్నికల సంఘానికి అందించామన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని ఆ వివరాలను అందించాలని కోరారు.


