News March 4, 2025
GNT: ‘వాలంటీర్’ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఇదే..!

గుంటూరు- కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడకు చెందిన వాలంటీర్ గంటా మమత ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఓట్ల లెక్కింపులో ఆమెకు మొత్తంగా 718 ఓట్లు వచ్చాయి. చట్ట సభల్లో ప్రజలు, వాలంటీర్ల సమస్యలను వినిపించాలనే ఉద్దేశంతో తాను బరిలోకి దిగినట్లు తెలిపారు. ఇకపైనా వాలంటీర్ల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. తనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 6, 2026
విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటాం: SP

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ పొలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
News March 6, 2026
ఈ నెల 10న జడ్పీలో జన్ సున్ వాయ్: GNT కలెక్టర్

జన్ సున్ వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. 10న ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వినతులు, పెండింగ్ అంశాలను స్వీకరించడం జరుగుతుందన్నారు.
News March 6, 2026
పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్ లక్ష్యాలు 100% అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో శుక్రవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. 100% పెర్ఫార్మెన్స్ సాధించడానికి గల కారణాలు, తక్కువ పెర్ఫార్మెన్స్ రావటానికి గల కారణాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలన్నారు.


