News August 21, 2024

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కార్యక్రమం వివరాలను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సీఎం 12.00 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళతారు. ముందుగా హోం శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం ఇసుక విధానం అమలు, రవాణా శాఖ, యువజన సర్వీసులు-క్రీడల శాఖపై సీఎం రివ్యూ చేస్తారు. రివ్యూ కార్యక్రమంలో సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలియజేసింది

Similar News

News November 20, 2025

ANU: ‘మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.

News November 20, 2025

ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

image

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.

News November 19, 2025

గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

వెలగపూడి సచివాలయంలోని గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం పరిశీలించారు. వీవీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ పర్యవేక్షణలో కేంద్రం కీలకమని పేర్కొంటూ పనిచేయని కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని, డ్రోన్ గస్తీని కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు-కరకట్ట మార్గాల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.