News December 22, 2024

GNT: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం

image

గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూతవేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం. 

Similar News

News January 21, 2025

హౌసింగ్ లే అవుట్స్ లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

image

హౌసింగ్ లే అవుట్స్‌లో ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందించేలా చూడాలని చెప్పారు. 

News January 21, 2025

గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 362 మంది ఉత్తీర్ణత 

image

గుంటూరు పోలీస్ కవాత్ మైదానంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో సోమవారం 362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 680 మంది అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ధృవపత్రాలు సక్రమంగా లేకపోవడంతో 102 మంది ఆరంభంలోనే వెనుదిరిగారు. చివరికి 578 మంది అభ్యర్థులకు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహించగా 362 మంది ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత పొందారు. ఎస్పీ సతీశ్ కుమార్, అదనపు ఎస్పీలు పర్యవేక్షించారు.

News January 21, 2025

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ 

image

మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. పోలీస్ శాఖ తరఫున అడిషనల్ కార్పస్ ఫండ్ పథకం కింద ఏఎస్ఐ అరుణాచలం కుటుంబ సభ్యులకు రూ.1లక్ష చెక్కును ఎస్పీ అందజేశారు. అలాగే ఏఆర్ఎస్ఐ మాణిక్యరావు కుటుంబ సభ్యులకు కూడా రూ.1లక్ష చెక్కును అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాగోగులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.