News March 16, 2025

GNT: అందుకే కావటి మనోహర్ రాజీనామా.?

image

నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జీఎంసీలో 4ఏళ్లలోపు ఎటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. ఈ నెలతో ఆ గడువు ముగుస్తుంది. కనుక అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతామని టీడీపీ నాయకులు బాహాటంగానే ప్రకటించారు. అందుకే మేయర్ రాజీనామా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Similar News

News March 17, 2025

GNT: ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ఎవరిని నియమిస్తారు.?

image

గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌‌ను ఇన్‌ఛార్జి మేయర్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండటం, ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ తరుఫున ఉండటంతో ఈ పదవి ఎవరికి ఇస్తారన్నదీ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ మేయర్‌గా తొలుత డైమండ్‌ బాబు నియమితులవ్వగా.. అనంతరం షేక్‌ సజీల ఎంపికయ్యారు. అయితే సీనియారిటీ ప్రాతిపదికన తమకే అవకాశం ఇవ్వాలని డైమండ్ బాబు గ్రూప్ వాదిస్తోంది. 

News March 17, 2025

గుంటూరు: 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.

News March 17, 2025

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 

error: Content is protected !!