News April 4, 2025
GNT: అభిరామ్‌కు సీఎం చంద్రబాబు అభినందన

సీఎం చంద్రబాబును గుంటూరుకు చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్ చావా కలిశారు. ఇటీవల తాను తయారుచేసిన ఎయిర్ ట్యాక్సీ గురించి సచివాలయంలో సీఎంను కలిసి వివరించారు. ఈ సందర్భంగా అభిరామ్‌ను సీఎం అభినందించారు. ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకి అయిన ఖర్చు వంటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండు సీట్ల సామర్థ్యంతో ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేశానని అభిరామ్ అన్నారు.
Similar News
News April 5, 2025
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం చంద్రబాబు కార్యాచరణ ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకలపైగా ఆస్పత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో త్వరితంగా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. PPP పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
News April 4, 2025
బర్డ్ ఫ్లూ కాదు… బాలిక మృతికి ఇతర కారణాలే

నరసరావుపేటలో బాలిక మృతిపై బర్డ్ ఫ్లూ అనుమానాలు తొలగిపోయాయి. ICMR బృందం తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాధినిరోధక శక్తి లోపం, అపరిశుభ్రత, లెప్టోస్పిరోసిస్ వంటి కారణాలే ప్రాణాపాయానికి దారితీశాయని తేలింది. బాలిక నుంచి H5N1 లక్షణాలు కనుగొన్నా, పరిసరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు అన్నారు.
News April 4, 2025
రీ-వెరిఫికేషన్ సద్వినియోగం చేసుకోండి: భార్గవ్ తేజ

కలెక్టరేట్‌లో శుక్రువారం జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సమావేశంలో పాల్గొని వికలాంగుల సంక్షేమం, ట్రాన్స్ జండర్స్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సదరన్ సర్టిఫికెట్లు జీజీహెచ్‌లో రీ-వెరిఫికేషన్ జరుగుతుందని, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. వికలాంగుల హక్కుల చట్టం 2016, వికలాంగుల సర్టిఫికెట్ల పంపిణీపై సమీక్షించారు.