News December 17, 2025
GNT: అలర్ట్.. PG సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడంటే.!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో FEBలో నిర్వహించనున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలు FEB 10 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు JAN 1వ తేదీలోగా అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. LLB పరీక్షల షెడ్యూలు కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ www.anu.ac.in సంప్రదించవచ్చు.
Similar News
News December 20, 2025
ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.
News December 20, 2025
శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగిస్తే..?

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది’ అంటున్నారు.
News December 20, 2025
సిద్దిపేట: ట్రాన్సజెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఉపాధి పునరావాస పథకం కింద ట్రాన్స్ జెండర్‌లకు బుుణాల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ అధికారి శారద తెలిపారు. జిల్లాకు మొత్తం 5 యూనిట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్‌ల కోసం ఈ పథకం కింద రూ.75 వేల పూర్తి సబ్సీడితో రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. www.wdsc.telangana.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


