News February 17, 2026

GNT: అసెంబ్లీలో విద్యార్థుల సందడి

image

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

Similar News

News February 17, 2026

GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

వేసవిలో నీటిసమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

image

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా నీరు, పారిశుద్ద్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారీగా నిధుల లభ్యత నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బోరు బావులు మరమ్మతులు 24 గంటల్లో పూర్తి చేయుటకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచాలన్నారు.

News February 17, 2026

గుంటూరులో CBSE టెన్త్ పరీక్షలు షురూ

image

గుంటూరు జిల్లాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.