News November 3, 2025
GNT: ఆన్‌లైన్ పెట్టుబడి మోసం.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్‌రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీ చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు నిర్వహించారు. పోలీసులు ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకొన్నారు.
Similar News
News November 4, 2025
షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్: లారా

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్. WC పైనల్‌లాంటి మ్యాచుల్లో పార్ట్‌టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.
News November 4, 2025
సంగారెడ్డి: కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణం ఇదే.!

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా లక్షల రూపాయలు నష్టపోవడంతో కానిస్టేబుల్ సందీప్ మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై ఆత్మహత్య చేసుకున్నారు. 2024 బ్యాచ్‌కు చెందిన సందీప్ గతంలో శిక్షణ సమయంలోనూ గేమింగ్ వ్యసనంతో ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస కావద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
News November 4, 2025
మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్‌లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.


