News December 20, 2025
GNT: ఆర్థిక భారమా.. దీర్ఘకాలిక ప్రయోజనమా?

ప్రభుత్వ కఠిన నియంత్రణ చర్యలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అపార్ట్‌మెంట్‌లు పెరుగుతున్నాయి. ఇటీవల నిబంధనల అమలులో భాగంగా అక్రమ నిర్మాణాలు, డివియేషన్‌ల వల్ల G+3 నియమాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ ధరలు రూ. 40 నుంచి రూ.55 లక్షల వరకు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులకు ఆర్థిక భారం పెరిగినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుంది. దీనిపై మీ COMMENT
Similar News
News December 20, 2025
ASF కలెక్టరేట్‌లో మీ డబ్బు..మీ హక్కు కార్యక్రమం

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక కార్యక్రమం ‘మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 23న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.
News December 20, 2025
యూరియా సరఫరాకు ప్రత్యేక మొబైల్ యాప్: కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకువచ్చిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రబీ సీజన్ దృష్ట్యా ఈ ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ను డిసెంబర్ 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా పొందవచ్చని పేర్కొన్నారు.
News December 20, 2025
విశాఖలో టెట్ పరీక్షకు 131 మంది గైర్హాజరు: డీఈవో

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 2,018 మంది అభ్యర్థులకు గానూ 1,887 మంది అభ్యర్థులు హాజరుకాగా 131 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ రెండు పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్ ఐదు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో పేర్కొన్నారు.


