News October 29, 2025
GNT: ‘ఇన్‌స్టా’ పరిచయం.. గర్భం దాల్చిన బాలిక

గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఒక మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వారు దగ్గరయ్యారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను చికిత్స నిమిత్తం GGH ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 29, 2025
అధికారులు అప్రమత్తం ఉండాలి: వరంగల్ ఎంపీ

మొంథా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజల భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సూచించారు. కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్, రోడ్డు భద్రత తదితర శాఖల అధికారులతో ఎంపీ డాక్టర్ కావ్య టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
News October 29, 2025
హైదరాబాద్‌లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం ప్రారంభం

అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.
News October 29, 2025
వరంగల్: రేపు పాఠశాలలకు సెలవు

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. బుధవారం ఆకస్మికంగా సెలవు ప్రకటించిన విషయం విదితమే. వర్షాలు కొనసాగుతుండడంతో పాటు తుఫాను తెలంగాణ కేంద్రీకృతమే ఉన్న కారణంగా ఈ సెలవును పొడిగిస్తున్నట్లు ఆమె చెప్పారు. పిల్లలెవరూ చేపల వేటకు వెళ్లొదని కోరారు.


