News February 11, 2025
GNT: ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమావేశం

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News September 18, 2025
వర్షపు నీటిని పొదుపు చేయాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసేందుకు వర్షపు నీటిని పొదుపు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో భూగర్భ నీటి వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకుని, భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని ప్రజలు పొదుపుగా వినియోగించాలన్నారు.
News September 18, 2025
ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి

ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్న తీరును, మధ్యాహ్న భోజనం, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు.
News September 18, 2025
VKB: అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ చౌరస్తా ఆధునికీకరణ పనులు, ఏరియా ఆసుపత్రిలోని సివిల్ మరమ్మతులను స్పీకర్ ప్రసాద్ కుమార్ పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.