News October 22, 2025
GNT: ఓ శకం ప్రారంభమై నేటికి పదేళ్లు

2014లో ఏపీ విభజన ఫలితంగా మిగిలిన రాష్ట్రానికి రాజధాని లేక నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబర్ 22న దసరా రోజున జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. 2017 నుంచి వెలగపూడిలో పనిచేయడం ప్రారంభించింది.
Similar News
News October 22, 2025
మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్‌కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న కాగితాల పూర్‌కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 22, 2025
ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి: కొలుసు

AP: పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 50% ఇళ్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు వచ్చేనెల 5 వరకు సర్వే నిర్వహిస్తామని, ఇళ్లు లేనివారు అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.28లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. 16నెలల్లోనే రూ.7.65లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.
News October 22, 2025
ములుగు: ‘డీసీసీ’ పీఠంపై అదే ఉత్కంఠ..!

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ప్రకటన వెలువడే అవకాశముంది. ఆరుగురు సీనియర్ నాయకులు ఏఐసీసీ పరిశీలకుడికి దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజ్ చేసిన ప్రకటన ఆలోచనలో పడేసింది. ఆ ఆరుగురు అధిష్ఠానం కరుణకోసం తీవ్రంగా తండ్లాడుతున్నారు.