News September 11, 2025

GNT: కానిస్టేబుల్ కొడుకు నుంచి డీజీపీ స్థాయికి ఎదిగారు

image

మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలులో 1955 సెప్టెంబర్‌ 11న జన్మించారు. తండ్రి శ్రీనివాసరావు కానిస్టేబుల్‌, 1979లో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్‌గా నియమితులైన తరువాత కూడా ఉన్నత చదువులు చదివారు. సెప్టెంబర్ 30, 2013న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఫిజిక్స్‌పై మక్కువతో తరంగ సిద్ధాంతం, బిగ్‌బ్యాంగ్ థియరీలపై రీసెర్చ్ చేస్తూనే ఉండేవారు.

Similar News

News September 11, 2025

కరీంనగర్: రూ.947.21 కోట్లతో ‘హ్యామ్’ రోడ్ల విస్తరణ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారుల అభివృద్ధికి హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటి మోడ్) ప్రోగ్రాం కింద ఆర్అండ్‌బీ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. రూ.947.21 కోట్లతో 48 పనులు చేపట్టి 616.41 కి.మీ. మేర పనులు పూర్తి చేయనున్నారు. కొత్త రోడ్లను నిర్మించడమే కాకుండా పాత వాటిని విస్తరించడం, రిపేర్లు చేస్తారు. ఫలితంగా గ్రామీణ రోడ్లు జిల్లా కేంద్రాలకు లింక్ అయి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

News September 11, 2025

ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

image

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.

News September 11, 2025

డయేరియా వల్ల మరణాలు సంభవించలేదు: కలెక్టర్

image

విజయవాడలో డయేరియా వ్యాధి కారణంగా ఎవరూ మరణించలేదని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. సాధారణ మరణాలను కూడా డయేరియా మరణాలుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. డయేరియాపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఇప్పటికే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు.